ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఆరేళ్ల చిన్నారులపై అఘాయిత్యం - చిత్తూరులో చిన్నారి అత్యచారం తాజా వార్త

రాష్ట్రంలో బాలికలపై అత్యాచార పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో ఆరేళ్ల వయసు గల ఇద్దరు చిన్నారులపై కీచకులు తెగబడ్డారు.

two children raped in andhra pradesh
ఆరేళ్ల చిన్నారులపై అఘాయిత్యం

By

Published : Nov 3, 2020, 8:03 AM IST

రాష్ట్రంలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో ఆరేళ్ల వయసు గల ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఓ బాలుడు (14), చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో ఓ కామాంధుడు (28) ఈ దారుణానికి ఒడిగట్టారు.

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ఓ గ్రామంలో మేనమామ ఇంటికి విశాఖ జిల్లా నక్కపల్లి మండలానికి చెందిన ఓ బాలుడు (14) వచ్చాడు. ఆదివారం సాయంత్రం ఓ బాలికను (6) ఇంటిపక్కన డాబాపై ఆరేసిన దుస్తులు తీసుకొద్దామని చెప్పి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో ఆ బాలిక వేసిన కేకలు విని మిగతా పిల్లలు రావడంతో అతను పారిపోయాడు. బాలికను వైద్యం నిమిత్తం ఏలేశ్వరం సీహెచ్‌సీకి తరలించారు.

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంటివద్ద ఒంటరిగా ఉంది. దీన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన మహేష్‌ (28) ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాత్రి నిద్రపోయే సమయంలో బాలికకు తీవ్ర రక్తస్రావం కావడాన్ని గుర్తించి వారు ఆరా తీశారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఏమిటీ పశువాంఛ: పవన్‌ కల్యాణ్‌

‘అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారమేమిటి? ఏమిటీ పశువాంఛ? అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘చిత్తూరు జిల్లాలో ఆదివారం జరిగిన ఘటనలో ఆ చిన్నారి పరిస్థితి ఊహించుకుంటే గుండెలు బరువెక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.‘ఈ మధ్య కాలంలో ఏపీలో ఆడపిల్లలపై వరుసగా అకృత్యాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లో 584 అత్యాచారం కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిర్భయ, దిశ వంటి చట్టాలు ఉన్నా ఎందుకు దాడులు జరుగుతున్నాయి అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

'తాజా ధరలతోనే పోలవరం.. ఈ మేరకు మీరే సిఫార్సు చేయండి'

ABOUT THE AUTHOR

...view details