తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం మాజీ అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ కాల్పుల ఘటనలో మరో ఇద్దరిపై కేసునమోదైంది. రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో 302 సెక్షన్ హత్యానేరం కింద నమోదుచేశారు.
తాజాగా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్న ఫారూఖ్ తనయుడు సహా సమీప బంధువు అఫ్రోజ్‌పై కేసునమోదు చేసి అరెస్ట్ చేశారు. ఫారూఖ్ తనయుడిని నిజామాబాద్‌లోని జువైనల్ హోంకు తరలించారు. అఫ్రోజ్‌ను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. డిసెంబర్ 18న ఆదిలాబాద్‌లోని తాటిగూడలో ఫారూఖ్ కాల్పులు జరపగా.. సయ్యద్ జమీర్ మృతిచెందారు.