కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల రోడ్డు సమీపంలో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. 450 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. జయంతిపురం గ్రామానికి చెందిన బాణావత్తు శ్రీను, లాహోరి కొండ ఇద్దరూ కలసి అక్రమంగా మద్యం సీసాలను ద్విచక్రవాహనంపై తీసుకెళుతుండగా పోలీసులు గుర్తించారు. వాహనాన్ని, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని చిల్లకల్లు ఎస్సై వి.వెంకటేశ్వరావు, టాస్క్ ఫోర్స్ ఎస్సై మురళీకృష్ణ తెలిపారు.
తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్టు - తెలంగాణ మద్యం ఏపీకి తరలింపు వార్తలు
తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 450 మద్యం సీసాలను.. కృష్ణా జిల్లా చిల్లకల్లు పోలీసులు పట్టుకున్నారు. జగ్గయ్యపేట మండలం ముక్త్యాల వద్ద.. రెండు బైకులపై అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. ఒక బైకు పట్టుకున్నామని, మరో బైకు కోసం విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Two arrested for smuggling