ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

నయీం కేసులో పోలీసు అధికారులకు క్లీన్​చిట్​ - నయీం కేసు తాజా వార్తలు

గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు అధికారులకు క్లీన్‌చిట్‌ వచ్చింది. నయీంకు సహకరించినట్లుగా 25 మంది పోలీసులపై వచ్చిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు లభించలేదని సిట్​ పేర్కొంది. సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి రాసిన లేఖకు సమాధానంగా ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్​ చిట్ ఇచ్చింది.

నయీం కేసులో పోలీసు అధికారులకు క్లీన్​చిట్​
నయీం కేసులో పోలీసు అధికారులకు క్లీన్​చిట్​

By

Published : Oct 3, 2020, 5:27 PM IST

కరుడుగట్టిన నేరస్థుడు, గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులకు క్లీన్‌చిట్‌ లభించింది. నయీంకు సహకరించినట్లు 25 మంది పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లభించకపోవడం వల్ల క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్‌ పేర్కొంది.

ఈ మేరకు సుపరిపాలన వేదిక రాసిన లేఖకు సిట్‌ సమాధానం ఇచ్చింది. పోలీసుల్లో ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, హెడ్‌ కానిస్టేబుల్‌, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details