బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజురోజుకు మలుపు తిరుగుతోంది. విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. గతంలో హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో దేవరాజ్‌పై శ్రావణి ఫిర్యాదు చేయగా అతనిని పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత బైయిల్‌పై విడుదలయ్యాడు.
అరెస్ట్ చేయించింది... విడుదలయ్యాక మళ్లీ క్లోజ్‌గా ఉంది - శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణాలు
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో దేవరాజ్‌ను పోలీసులు రెండో రోజు విచారణ చేస్తున్నారు. నిన్నటి నుంచి ఎస్సార్ నగర్ పీఎస్‌లోనే విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
అరెస్ట్ చేయించింది... విడుదలయ్యాక మళ్లీ క్లోజ్‌గా ఉంది
అనంతరం శ్రావణి దేవరాజ్‌ను కలిసింది. అతనితో కలిసి సెల్ఫీ వీడియో తీసుకుంది. ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇద్దరూ జాగ్రత్తపడ్డారు. మళ్లీ స్నేహంగా మెలిగారు. శ్రావణి ఆత్మహత్య చేసుకునే రెండు రోజుల ముందు శ్రీ కన్య హోటల్లో ఇద్దరు కలిశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సాయి రెడ్డికి దేవరాజ్‌కు మాటమాట పెరిగి... ఇద్దరు గొడవపడినట్లు విచారణలో తేలింది.
ఇదీ చూడండి:కుటుంబసభ్యులే వేధిస్తున్నారని చెప్పింది: దేవరాజ్