ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. వ్యక్తి మృతి - కరీంనగర్​లో ట్రాక్టర్​ ఢీ కొని వ్యక్తి మృతి వార్తలు

దీపావళి పండగ వేళ నోము నోచుకుని కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. వేగంగా దూసుకొచ్చిన ట్రాక్టర్​... ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. ఓ ట్రాక్టర్​ డ్రైవర్​ నిర్లక్ష్యం... ఆ ఇంటి పెద్దను బలితీసుకుంది.

ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. వ్యక్తి మృతి
ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. వ్యక్తి మృతి

By

Published : Nov 15, 2020, 8:53 PM IST

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంటలో పండుగపూట విషాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ట్రాక్టర్​ అదుపుతప్పి కందకూరి సాగర్​ ఇంటి గోడను ఢీ కొట్టింది. ఈ ఘటనలో గోడ కూలిపోయింది. అదేసమయంలో గోడ దగ్గర ఉన్న సాగర్​పై గోడ పడగా... తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

క్షతగాత్రున్ని హుటాహుటిన అంబులెన్స్​లో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య శ్యామల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ట్రాక్టర్​ డ్రైవర్​ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. వ్యక్తి మృతి

ఇదీ చూడండి: పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గించడం లేదు: మంత్రి అనిల్‌

ABOUT THE AUTHOR

...view details