ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

మళ్లీ తెరపైకి టాలీవుడ్​ డ్రగ్స్​ కేసు - tollywood drugs case update news

మాదకద్రవ్యాల వ్యవహారం భారత సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. బాలీవుడ్‌, శాండల్‌వుడ్‌లలో డ్రగ్స్‌ దుమారం రేపుతున్న వేళ... మూడేళ్ల క్రితం టాలీవుడ్‌లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. మూడేళ్ల క్రితం టాలీవుడ్​ను గడగడలాడించిన మాదకద్రవ్యాల ఉదంతం తెరపైకి వచ్చింది. అనేక మంది టాలీవుడ్ సినీతారలు మత్తు మందులు వాడారన్న సమాచారంతో రాష్ట్ర ఆబ్కారీ అధికారులు వారందర్నీ పిలిచి విచారించడం అప్పట్లోనే కలకలం రేపింది. ఇది జరిగి మూడేళ్లు పూర్తయినా ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ఈ వ్యవహారంపై సుపరిపాలన వేదిక.... అబ్కారీశాఖను ఆర్టీఐ ద్వారా వివరణ కోరగా... పలు కీలక విషయాలు వెలుగుచూశాయి.

tollywood-drugs-case-latest-news
tollywood-drugs-case-latest-news

By

Published : Sep 23, 2020, 11:59 PM IST

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసుపై విచారణలో భాగంగా వెలుగుచూసిన మాదకద్రవ్యాల వ్యవహారంతో .... మూడేళ్ల క్రితం తెలుగు సినీ పరిశ్రమను కుదుపు కుదిపేసిన డ్రగ్స్ ఉదంతం మళ్లీ తెరపైకి వచ్చింది. అనేక మంది తెలుగు సినీతారలు మత్తు మందులు వాడారన్న సమాచారంతో అబ్కారీ అధికారులు వారిని పిలిచి విచారించడం అప్పట్లోనే సంచలనం రేపింది. ఇది జరిగి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కొలిక్కిరాలేదు. దీంతో సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి..... ఈ డ్రగ్స్ వ్యవహారంపై ఆర్టీఐ యాక్ట్​ ద్వారా అబ్కారీశాఖను వివరణ కోరి పలు కీలక విషయాలను రాబట్టారు.

ఆరా తీయగా వెలుగులోకి..

2017 జులై 2న సికింద్రాబాద్‌కు చెందిన కెల్విన్ మాస్కెరాన్స్, చంద్రాయణగుట్ట ఇస్మాయిల్ నగర్‌కు చెందిన సోదరులు ఎండీ అబ్దుల్ వహాబ్, ఎండీ అబ్దుల్ ఖుద్దూస్‌లను అబ్కారీ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 700 యూనిట్ల ఎల్​ఎస్​డీ, 35 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా కెల్విన్ వెల్లడించిన విషయాలు అప్పట్లో సంచలనం రేకెత్తించాయి. పాఠశాల విద్యార్ధులు మొదలు టాలీవుడ్‌లో అనేక మంది సినీ ప్రముఖులకు మత్తు మందులు సరఫరా చేసినట్లు చెప్పడం కలకలం రేగింది. దీంతో ఆబ్కారీ అధికారులు మొత్తం 12 మంది సినీతారలను రోజుకు ఒక్కొక్కరిని చొప్పున పిలిపించి విచారించారు.

సినీతారల ప్రస్తావన లేదు..

గత మూడేళ్లలో ఆబ్కారీ అధికారులు మొత్తం 12 కేసులు నమోదు చేయగా.... ఇప్పటివరకూ కేవలం 8 కేసులలో మాత్రమే అభియోగపత్రాలు దాఖలు చేశారు. మొత్తం 62 మందిని విచారించారు. మత్తుమందులు సరఫరా చేసిన వారికి సంబంధించిన కేసులలో మాత్రమే ఆభియోగపత్రాలు దాఖలు చేశారు. వారు ఎక్కడెక్కడ నుంచి తెచ్చేవారు.. ఎలా తయారు చేసేవారన్న విషయాలను ఇందులో పేర్కొన్నారు. కొందరు స్థానికంగానే మత్తు మందులు తయారు చేసినట్లు పేర్కొన్నారు. కొందరు నిందితులు జర్మనీ, ఇంగ్లాండు , నెదర్లాండ్స్ నుంచి కొరియర్ ద్వారా మత్తు మందులు దిగుమతి చేసుకున్నట్లు కూడా అభియోగపత్రాల్లో పేర్కొన్నారు. అయితే వీటిలో ఎక్కడా సినీతారలకు సంబంధించిన ప్రస్తావన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

సిట్​ నివేదిక బయటపెట్టాలి

సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సిట్ నివేదిక బయటపెట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకూ అభియోగపత్రాలు దాఖలు చేసిన ఈ కేసులకు సంబందించిన వివరాలు కూడా వెల్లడించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details