మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మహిళలు అదృశ్యమయ్యారు. దుండిగల్‌లో నివాసం ఉంటున్న హెచ్. శిరీష అనే విద్యార్థి ఈనెల 19న ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. సురారం రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే వై. భారతి(21) కొంపల్లిలో ఉద్యోగం చేస్తోంది. 20న ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.
ముగ్గురు మహిళలు అదృశ్యం.. ఇంకా దొరకని ఆచూకీ.. - 3 girls missing in medchal district news
ముగ్గురు మహిళలు కనిపించకుండాపోయిన ఘటనలు తెలంగాణ మేడ్చల్ జిల్లా దండిగల్లో చోటుచేకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురు మహిళలు అదృశ్యం.. ఇంకా దొరకని ఆచూకీ..
బహుదూర్‌పల్లి ఇందిరమ్మ కాలనీ చెందిన ఎమ్.పద్మావతి (38) 20వ తేదీన భర్తతో గొడవపడి, 21న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవటంతో భర్త లక్ష్మారెడ్డి దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలకు సంబంధించి ఫిర్యాదు స్వీకరించిన కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
TAGGED:
Medchal district crime news