ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కటాఫ్ ఏరియా.. సింగారం అటవీప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఒకరిని మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు మల్లన్నగా గుర్తించారు. మరొక మహిళా మావోయిస్టును గుర్తించాల్సి ఉంది.
ఏవోబీలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి
09:31 December 13
ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
ఒడిశాకు చెందిన ఎస్‌వోజీ , డీవీఎఫ్ బలగాలకు.. కటాఫ్ ఏరియా ప్రాంతంలోని ఎగజనభ సమీపంలోని సింగారం అటవీప్రాంతంలో మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చిన సమయంలో సంఘటనా స్థలంలో 12 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరు వర్గాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మిగిలిన 10మంది మావోలు తప్పించుకున్నారు.
తప్పించుకున్నవారి కోసం భద్రతా బలగాలు గాలింపు చేస్తున్నాయి. ఈ క్రమంలో విశాఖ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన ప్రాంతం చింతపల్లికి సమీపంలో ఉన్న కారణంగా.. బలగాలు ఆ అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్నాయి. పీఎల్‌జీఏ వారోత్సవాల ముందు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా.. నెలరోజుల వ్యవధిలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడంతో ఏవోబీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఇదీ చదవండి: