కడప నుంచి కర్నూలు వైపు వెళ్తు డీటీడీసీ కొరియర్ వాహనంలో చోరీ జరిగింది. నంద్యాల దగ్గర వాహనంలో చొరబడిన ఆగంతకులు.. అందులో పలు రకాల వస్తువులను అపహరించారు. డ్రైవర్ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 44వేల రూపాయల విలువైన వస్తువులు దోపిడీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్లు, బట్టలు, స్ప్రేర్ పార్ట్స్ తదితర వస్తువులను ఎత్తుకెళ్లారన్నారు.
డీటీడీసీ కొరియర్ వాహనంలో చోరీ - theft in dtdc vehicle in kurnool
డీటీడీసీ కొరియర్ వాహనంలో చోరీ జరిగింది. కడప నుంచి కర్నూలు వెళ్తున్న వాహనంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 44 వేల రూపాయల విలువైన వస్తువులు అపహరించారు.
'డీటీడీసీ కొరియర్ వాహనంలో చోరీ'