ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

నగదు చోరీ చేసి సీసీ కెమెరాతో పరార్ - theft in peddapalli

తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఆటోమొబైల్స్​ షాపులో భారీ చోరీ జరిగింది. దుకాణంలోని సీసీ కెమెరాతో సహా కౌంటర్​లో ఉన్న లక్షా యాభై వేల రూపాయలను ఓ వ్యక్తి దొంగిలించాడు.

theft in automobile shop at manthani in peddapalli district
నగదు చోరీ చేసి సీసీకెమెరాతో పరారైన దుండగుడు

By

Published : Feb 11, 2020, 10:56 PM IST

నగదు చోరీ చేసి సీసీకెమెరాతో పరారైన దుండగుడు

తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బ్రిడ్జి వద్ద ఉన్న బిట్టు ఆటోమొబైల్స్​ షాపులో చోరీ జరిగింది. ఈరోజు ఉదయం కౌంటర్​లో ఉన్న డబ్బు తీసుకుందామని యజమాని శ్రీనివాస్​ షాపు తెరవగా... శబ్దం వచ్చింది. ఎలుకల వల్ల శబ్దం వచ్చిందనుకుని కౌంటర్​ తెరిచాడు. అందులో గతరాత్రి పెట్టిన లక్షా యాభైవేల రూపాయలు కనిపించకపోయేసరికి ఖంగుతిన్నాడు.

షాపు వెనుకనుంచి శబ్దం వస్తోందని చూడగా... ఓ వ్యక్తి అక్కణ్నుంచి పరారవుతూ కనిపించాడు. అతన్ని వెంబడించినా ఫలితం లేకపోయిందని శ్రీనివాస్​ పోలీసులను ఆశ్రయించాడు. షాపులోని నగదుతో పాటు సీసీ కెమెరానూ ఎత్తుకెళ్లాడని ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనాస్థలంలో వేలి ముద్రలు సేకరించారు. కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details