కృష్ణా జిల్లా కొండపల్లిలోని వైద్యాధికారి డాక్టర్ శిరీష ఇంట్లో దొంగలు పడ్డారు. కర్రకు చివర కత్తి కట్టి కిటికీలోనుంచి తలుపు తెరిచిన దొంగలు.. సుమారు 300 గ్రాముల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. ఇంట్లో వారిని కత్తితో బెదిరించి నగలు ఎత్తుకెళ్లారు దుండగులు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా..క్లూస్ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని వేలిముద్రలు సేకరిస్తున్నారు.
వైద్యురాలి ఇంట్లో చోరీ.. కత్తితో బెదిరించి బంగారంతో పరారీ.. - కృష్ణా జిల్లాలో దొంగతనాలు
ఎంత జాగ్రత్తగా ఉన్నా దొంగలు వారి ప్రతాపాన్ని చూపిస్తున్నారు. భయానో నయానో బెదిరించి మరీ ఇంట్లో సొమ్ములను కాజేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఓ డాక్టర్ ఇంట్లోకి చొరబడిన దొంగలు.. వారిని కత్తితో బెదిరించి 300 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.
Theft at the doctor's house