విశాఖ జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాం పరిధిలో ఉన్న పి.నారాయణమూర్తి అనే వ్యక్తికి చెందిన ఇంట్లో ఈ నెల 5వ తేదీన చోరీ జరిగింది. ఈ ఘటనలో 60 తులాల బంగారం, 5 కిలోల వెండి, రూ. 5 లక్షల నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అగంతకులు దొంగతనం చేశారని బాధితులు పోలీసులకు తెలిపారు. విశాఖ నార్త్ జోన్ క్రైమ్ సీఐ గోవిందరావు, సీసీఎస్- సీఐ రవిప్రసాద్ విచారణ చేపట్టారు.
ఇంట్లో ఎవరూ లేనిది చూసి.. 60 తులాలు చోరీ! - విశాఖ
విశాఖ జిల్లా శొంఠ్యాం పరిధిలో పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ నెల 5న ఆనందపురం - పెందుర్తి రహదారి పక్కనున్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనానికి పాల్పడ్డారు. 60 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
శొంఠ్యాంలో భారీ చోరీ