అనుమానాస్పదంగా యువతి మృతి - కర్నూలు నేర వార్తలు
అనుమానాస్పదంగా యువతి మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడులో చోటుచేసుకుంది.

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని ఎర్రబాడులో 23 సంవత్సరాల యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇంటి నుంచి పొలానికి ఒంటరిగా వెళ్లగా... దారి మధ్యలో ముళ్ల పొదలో మృతి చెంది ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికిి తరలించారు. మృతురాలు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.