ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ముఖ్యమంత్రికే ఎదురెళ్లి.. పోలీసుల చేతిలో బుక్కయ్యాడు! - హైదరాబాద్​ వార్తలు

ముఖ్యమంత్రి కాన్వాయ్​కి ఓ యువకుడు అడ్డొచ్చాడు. తనకు ఉద్యోగం ఇప్పించాలని.. ఇంటిని మంజూరు చేయాలని డిమాండ్ చేశాడు. వెంటనే అడ్డుకున్న పోలీసులు.. అతన్ని తీసుకున్నారు. కేసు నమోదు చేశారు.

సీఎం కాన్వాయ్​కు అడ్డు పడిన యువకుడు
సీఎం కాన్వాయ్​కు అడ్డు పడిన యువకుడు

By

Published : Jun 2, 2020, 7:23 PM IST

సీఎం కాన్వాయ్​కు అడ్డు పడిన యువకుడు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. హైదరాబాద్​లోని గన్ పార్కు అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. తిరుగు ప్రయాణంలో ఆయన కాన్వాయ్​కు... దేవరకొండకు చెందిన హనుమంత్‌ నాయక్‌ అడ్డు పడ్డాడు. తనకు ఉద్యోగం ఇప్పించాలని.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలన్నాడు.

అక్కడున్న పోలీసులు అతన్ని వెంటనే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. హనుమంత్‌ నాయక్‌ జీహెచ్‌ఎంసీలో విపత్తు నిర్వహణ వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై సీపీ అంజనీ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని సిబ్బందిని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details