మాటు వేసి మరీ..
సాయి శ్రీనివాస్ తన స్నేహితులైన ఆరుగురు వ్యక్తులతో ఈ హత్యచేయించాడని పోలీసులు విచారణలో తేలింది. ఈనెల 1వ తేదీ అర్థరాత్రి ప్రత్తిపాడు రైల్వే గేటు వద్ద టెలిఫోన్ సమస్య వచ్చేలా చేశారు. సాయి శ్రీనివాస్ నిడదవోలు రైల్వే జూనియర్ ఇంజినీర్ పాలికల లోకేష్ కుమార్ సహకారంతో సుజిత్‌ను అక్కడకు రప్పించారు. అప్పటికే శ్రీనివాస్ ఆరుగురు వ్యక్తులను ఆటోలో ఇరగవరం నుంచి తాడేపల్లిగూడెం రప్పించాడు. రైల్వే గేటు వద్దకు వచ్చిన సుజిత్పై మాటు వేసిన నిందితులు మూకుమ్మడిగా దాడి చేశారన్నారు. అతనిపై కూర్చుని బలవంతంగా కాళ్ళు, చేతులూ కట్టేశారన్నారు. ఊపిరాడకుండా చేసి హత్య చేశారన్నారు. హత్య అనంతరం మృతుని వద్ద పర్సులోని నగదు, ఉంగరం, సెల్‌ఫోన్ తీసుకువెళ్లారన్నారు. అనంతరం మృతదేహాన్ని ఆకుల గోపయ్య ఇంజినీరింగ్ కళాశాల వెనుక విసిరేసి పరారయ్యారని తమ విచారణలో తేలిందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆరేటి సాయి శ్రీనివాస్.. చామకూరి నాగేంద్ర, మంగిన శ్రీనివాస్, వర్థినీడి గోపాలం, వలవల రామాంజనేయులు, ఆరేటి బ్రహ్మయ్య, కొమ్ముల నాగ సతీష్‌తో హత్య చేయించాడన్నారు. ఈ ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించనున్నామని తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక ఆటో, ద్విచక్రవాహనం, నగదు, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
దర్యాప్తు బృందానికి ప్రశంస...
ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన తాడేపల్లిగూడెం రూరల్ సి.ఐ రవికుమార్, టౌన్ సి.ఐ ఆకుల రఘు, పెంటపాడు ఎస్సై శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం రూరల్ ఎస్సై కె.వై.దాస్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారని డీఎస్పీ తెలిపారు.