తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బీజీనాయక్ తండా శివారు జాటోతు తండాలో తల్లి మందలించిందని ఓ చిన్నారి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తండాకు చెందిన పావణి (14) అనే బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇంటి పనులు చేయడం లేదంటూ తల్లి శనివారం మందలించడం వల్ల మనస్తాపానికి గురైన చిన్నారి ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తె మరణవార్త విన్న తల్లిదండ్రులు రోధించిన తీరు తండావాసులను కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్య - మహబూబాబాద్ జిల్లా
ఇంటి పనులు చేయడం లేదని తల్లి మందలించడం వల్ల ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్య