పొలం పనులకు వెళ్తున్న తన కుమార్తెను ఆపరేషన్ ముస్కాన్ పేరుతో పోలీసులు తీసుకెళ్లడంపై తల్లి మనస్థాపానికి గురైంది. అక్కడికక్కడే కుప్పకూలి కన్నుమూసింది. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో ఈ విషాదం జరిగింది.
చిన్నారిని తీసుకెళ్లిన పోలీసులు..ఆగిన తల్లి గుండె
17:38 November 02
చిన్నారిని తీసుకెళ్లిన పోలీసులు..ఆవేదనతో కన్నతల్లి మృతి
కొమరగిరి కోటేశ్వరమ్మ(35) ఆమె కుమార్తె మానస(10) సోమవారం సమీప బంధువులతో కలిసి పొలం పనులకు బయల్దేరింది. అదే సమయంలో పోలీసులు 'ఆపరేషన్ ముస్కాన్' కార్యక్రమం కింద ఆ బాలికను అడ్డుకున్నారు. పనికి వెళ్లొద్దంటూ వత్సవాయి పోలీసుస్టేషన్ కు తరలించారు. ఆధార్, రేషన్ కార్డు ఇతర గుర్తింపు పత్రాలు తీసుకుని వెంటనే స్టేషన్ కి రావాలని తల్లిదండ్రులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. ఆందోళనకు గురైన తల్లి కోటేశ్వరమ్మ ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలారు. స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందింది. కోటేశ్వరమ్మ మృతికి పోలీసులే కారణమని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. మృతదేహాన్ని కంభంపాడు చెక్ పోస్ట్ వద్ద ఉంచి ఆందోళన చేశారు.
ఇదీ చదవండి