ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

బైక్​ను ఢీకొన్న లారీ.. అక్కడికక్కడే వ్యక్తి మృతి - అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం

ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో జరిగింది. వేగంగా వస్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టగా.. వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

బైక్​ను ఢీకొన్న లారీ.. అక్కడికక్కడే వ్యక్తి మృతి
బైక్​ను ఢీకొన్న లారీ.. అక్కడికక్కడే వ్యక్తి మృతి

By

Published : Sep 24, 2020, 7:10 PM IST

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు ప్రాణం కోల్పోయాడు. సుమారు వంద అడుగుల దూరం వరకు మృతదేహాన్ని లారీ ఈడ్చుకెళ్లింది. భయాందోళనకు గురైన డ్రైవర్.. లారీని అక్కడే వదిలి పరారయ్యాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పరిశీలించిన సీఐ..

ప్రమాదం జరిగిన తీరును గుత్తి సీఐ రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. అంబులెన్స్ వచ్చేలోగా సీఐ తన వాహనంలో యువకుడి మృతదేహాన్ని ఎక్కించారు. అనంతరం మృతదేహానికి శవ పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి : సీఎంఆర్ఎఫ్ చెక్కుల కేసు.. లొంగిపోయిన నిందితుడు

ABOUT THE AUTHOR

...view details