కృష్ణా జిల్లా విజయవాడలో కత్తులు, రాళ్లతో దాడులు చేసుకుని యువకులు వీరంగం సృష్టించారు. పటమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య వివాదం తలెత్తడంతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ దాడుల్లో మాజీ రౌడీ షీటర్ ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ఈ గొడవలు విజయవాడ పటమట వాసులు తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. కత్తి పోట్లు, రాళ్ల దాడుల్లో గాయపడ్డ వారిని చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రాజకీయ పార్టీల నేతల అనుచరులు కూడా ఉండటంతో విజయవాడ నగర పోలీసులు గుట్టుగా విచారణ చేస్తున్నారని సమాచారం.
విజయవాడలో విద్యార్థుల గ్యాంగ్ వార్.. పలువురికి తీవ్ర గాయాలు - vijayawad crime news
విజయవాడలోని పటమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం కత్తులు, కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి.
![విజయవాడలో విద్యార్థుల గ్యాంగ్ వార్.. పలువురికి తీవ్ర గాయాలు The clash between the two student groups on the padmata led to attacks on each other.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7416264-387-7416264-1590905238691.jpg)
విజయవాడలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణ
విజయవాడలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణ
ఇవీ చదవండి:ఆంధ్రా- తెలంగాణ సరిహద్దులో మద్యం పట్టివేత...
Last Updated : May 31, 2020, 6:37 PM IST