పాత కక్షలతో రెండు వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా తొట్టంబేడులో జరిగింది. గ్రామానికి చెందిన గోపి(35)పై అదే గ్రామానికి చెందిన మరో వర్గం వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన గోపి ఆసుపత్రికి చేరుకునే లోపు మృతి చెందాడు. పెళ్లిరోజు నాడే భర్త మృతి చెందడంతో భార్య, పిల్లలు రోదన వర్ణనాతీతంగా మారింది.
తొట్టంబేడులో ఇరు వర్గాల ఘర్షణ... ఒకరు మృతి - chittor district news
చిత్తూరు జిల్లా తొట్టంబేడులో దారుణం జరిగింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

తొట్టంబేడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ఒకరు మృతి