చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, శ్రీనివాసమంగాపురం సమీపంలో ఎర్రచందనం డంప్‌ను టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. శ్రీవారిమెట్టు వెనుకవైపు సచ్చినోడిబండ, అన్నదమ్ముల కోన, జొన్నరాసికుప్ప ప్రాంతాల నుంచి దుంగలను మోసుకొచ్చి శ్రీనివాసమంగాపురం సమీపంలో డంప్ చేసుకున్నారు స్మగ్లర్లు. సంఘటన స్థలానికి చేరుకున్న టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు మాట్లాడుతూ.. లాక్డౌన్ తర్వాత స్మగ్లర్లు బరితెగిస్తున్నారని అన్నారు. జన సంచారం గల ప్రాంతాల్లో లోడింగ్ పాయింట్స్ పెట్టుకోవడం సాహసోపేతమైన నిర్ణయమని తెలిపారు. కొందరు స్థానికులు స్మగ్లర్లకు షెల్టర్లు ఇస్తున్నట్లు సమాచారం అందిందని.. వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. సంఘటన స్థలాంలో 49 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పరారైన స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
శేషాచల అడవుల్లో టాస్క్‌ఫోర్స్ కూంబింగ్.. 49 ఎర్రచందనం దుంగలు స్వాధీనం - శేషాచల అడవుల్లో ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవులలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. జన సంచారం గల ప్రాంతాలనే లోడింగ్ పాయింట్లుగా ఎంచుకుంటున్నారు. ఇవాళ శ్రీనివాసమంగాపురం సచ్చినోడి బండ సమీపంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న సుమారు 50 మంది స్మగ్లర్లపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేపట్టారు. స్మగ్లర్లు పరారు కాగా 49 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
Task Force Combing