ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

విద్యార్థిని ఆత్మహత్య... ఆర్థిక పరిస్థితులే కారణం - ఆర్థిక పరిస్థితులో రంగారెడ్డిలో విద్యార్థిని ఆత్మహత్య వార్తలు

కష్టపడి చదివింది. దిల్లీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​ సీటు సంపాదించింది. ఇది చూసి తల్లిదండ్రులు గర్వంగా ఫీలయ్యారు. కానీ కొన్ని రోజులకు చదువు భారమైంది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని చూసి ఆ విద్యార్థిని చలించిపోయింది. మానసికంగా బాధపడి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

విద్యార్థిని ఆత్మహత్య... ఆర్థిక పరిస్థితులే కారణం
విద్యార్థిని ఆత్మహత్య... ఆర్థిక పరిస్థితులే కారణం

By

Published : Nov 8, 2020, 10:41 PM IST

దిల్లీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని ఆర్థిక పరిస్థితులు సరిగా లేక.. చదువు భారమై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ పట్టణంలోని ఫరూక్​నగర్​లో నివాసం ఉండే మెకానిక్ శ్రీనివాసరెడ్డి, సుమతిల కుమార్తె ఐశ్వర్య రెడ్డి ఇంటర్మీడియట్​లో రాష్ట్రస్థాయి ర్యాంకును సాధించి దిల్లీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​లో ఉచిత సీటు సాధించింది.

విద్యార్థిని ఆత్మహత్య... ఆర్థిక పరిస్థితులే కారణం

అగ్రవర్ణ విద్యార్థి కావడం వల్ల ప్రభుత్వపరంగా ఆర్థిక సహకారం లేకపోవడం వల్ల హాస్టల్​లో ఉండి చదవడం పెనుభారంగా మారింది. మానసికంగా బాధపడిన ఈ విద్యార్థిని ఈ నెల 3న ఇంట్లోనే ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు సీఐ శ్రీధర్ కుమార్ తెలిపారు.

ఇవీ చూడండి: నంద్యాల ఘటనపై సీఎం జగన్ సీరియస్

ABOUT THE AUTHOR

...view details