ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

తల్లిదండ్రుల మందలించారని విద్యార్థిని బలవన్మరణం - muppalla police latest news

ఆన్​లైన్ పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని కుటుంబ సభ్యులు మందలించడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో చోటు చేసుకుంది.

మార్కులు తక్కువ వచ్చాయన్నందుకు విద్యార్థిని బలవన్మరణం
మార్కులు తక్కువ వచ్చాయన్నందుకు విద్యార్థిని బలవన్మరణం

By

Published : Oct 2, 2020, 8:47 AM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో మార్కులు తక్కువగా వచ్చాయని కుటుంబీకులు మందలించడం వల్ల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఇటీవలే ఆన్​లైన్ పరీక్షలు రాసింది. ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఆ కళాశాల యాజమాన్యం విద్యార్థిని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు.

మనస్తాపంతోనే..

ఈ క్రమంలో మార్కుల తక్కువ రావడంపై బాధిత విద్యార్థిని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. మనస్తాపానికి గురైన బాధితురాలు సెప్టెంబర్ 21న కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు వెంటనే గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో తరలించారు.

తుదిశ్వాస..

చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు ముప్పాళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి : తెదేపా మహిళా కార్యవర్గం సభ్యులు వీరే

ABOUT THE AUTHOR

...view details