దేహదారుడ్య జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడిన వ్యక్తి హానికారక ఉత్ప్రేరకాలను విక్రయించే వ్యాపారం ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా, అమెరికా లండన్ నుంచి హానికారక ఉత్ప్రేరకాలను ఆన్లైన్ ద్వారా దిగుమతి చేసుకుని విక్రయిస్తూ సొమ్ము చేసుకున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న దుకాణంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి చేయడంతో అక్రమ వ్యాపారం బయటపడింది.
హైదరాబాద్‌లో స్టెరాయిడ్స్.. ఇద్దరు అరెస్టు - ఇద్దరిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
హైదరాబాద్.. బంజారాహిల్స్‌లో నిషేధిత స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న ఓ దుకాణంపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 14 లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు.
![హైదరాబాద్‌లో స్టెరాయిడ్స్.. ఇద్దరు అరెస్టు steroids-in-banjara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9848875-1020-9848875-1607723384264.jpg)
హబీబ్‌నగర్‌కు చెందిన జుబేర్ గత పన్నెండేళ్లుగా వ్యాయామశాలలో శిక్షకుడిగా పని చేస్తున్నాడు. జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. గత నాలుగైళ్లుగా తన సోదరుడి ముస్తఫాతో కలిసి బంజారాహిల్స్‌లో ఉత్ప్రేరకాలు విక్రయం ప్రారంభించాడు. ఏ1 సప్లిమెంట్ స్టోర్ పేరుతో నిర్వహిస్తున్న దుకాణంలో దేహ దారుఢ్యానికి ఉపయోగించే ఉత్ప్రేరక పదార్థాలను, ఔషధాలను విక్రయిస్తున్నాడు. ఉత్ప్రేరకాలను ఉపయోగించడం వల్ల శరీరంలోని మూత్రపిండాలు, కాలేయం, గుండెపై ప్రభావం పడుతుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో జుబేర్, అతని సోదరుడు ముస్తఫాను అరెస్టు చేసి 14 లక్షల రూపాయల విలువ చేసే ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి:నాలుగేళ్ల బాలుడిని.. బెల్టుతో వాతలు పడేలా కొట్టిన మేనమామ