ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

​ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు.. వ్యక్తి అరెస్ట్​ - sharmila

వైఎస్​ జగన్​ సోదరి షర్మిలపై యూట్యూబ్​లో అనుచిత వ్యాఖ్యలు చేసిన హరిబాబు అలియాస్​ హరీశ్​ చౌదరి అనే వ్యక్తిని హైదరాబాద్ పరిధిలోని రాయదుర్గం పోలీసులు అరెస్ట్​ చేశారు.

​ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్​

By

Published : Mar 27, 2019, 6:55 PM IST

​ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్​
వైకాపా అధినేత వైఎస్​ జగన్​ సోదరి షర్మిలపై సామాజిక మాధ్యమాల్లోఅనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని.. హైదరాబాద్ పరిధిలోని రాయదుర్గం పోలీసులు అరెస్ట్​ చేశారు. అమరావతి వైకాపా కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఓ యూట్యూబ్​ ఛానల్​ ప్రత్యక్షప్రసారం చేసింది. ఈ సమయంలోనే షర్మిలపై హరీశ్​ చౌదరిఅనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతని వ్యాఖ్యలపై అనిల్​ అనే వైకాపా అభిమాని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు హరీశ్​ అలియాస్​ హరిబాబును అరెస్ట్​ చేశారు. నిందితుడి స్వస్థలం ప్రకాశం జిల్లా అద్దంకిగా గుర్తించారు. గతంలోనూ షర్మిలపై ఇదే విధంగా హరీష్ వ్యాఖ్యలు చేశాడని రాయదుర్గం సీఐ రవీందర్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details