ఆస్తి లావాదేవీల్లో మధ్యవర్తుల మాటలు రుచించని కొడుకు చిన్నాన్నపై కత్తితో దాడి చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామంలో తాతల నుంచి సంక్రమించిన 90 సెంట్లు చేపల చెరువు, 20 సెంట్ల భూమి వివాదంలో శ్రీనివాసరాజు, పెద్దిరాజు సోదరులు ఇరువురు కోర్టుకెక్కారు. నెల రోజుల కిందట పెద్దిరాజు మరణించడంతో అతని కొడుకు గాదిరాజు వెంకటరాజు, చిన్నాన్న శ్రీనివాసరాజు ఆస్తి విషయంలో పెద్దలను ఆశ్రయించారు.
ఆస్తి కోసం చిన్నాన్నపై కత్తిదూసిన కొడుకు
బంధాలు శాశ్వతం.. ఆస్తులు కాదు ఇది ఒకప్పటి మాట. నేడు .... ఆస్తుల కోసం కత్తులు దూస్తున్న కాలం. బంధం ఏదైనా ఆస్తే ముఖ్యం. ఆస్తి కోసం కత్తి పడుతున్నారు. బంధుత్వం మరుస్తున్నారు. ఓ ఆస్తి విదాదంలో సొంత చిన్నాన్నపై కత్తితో దాడి చేసిన దారుణ ఘటన పశ్చిగోదావరి జిల్లా నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో జరిగింది.
20 సెంట్ల భూమిని శ్రీనివాసరాజు బాగుచేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వెంకటరాజు, శ్రీనివాసరాజుల మధ్య మాట మాట పెరిగి బాబాయిపై కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో శ్రీనివాసరాజు ఎడమ కాలికి తీవ్రగాయం అవ్వడంతో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం శస్త్ర చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుని నేరుగా ఆస్పత్రికి తరలించడంతో పూర్తి సమాచారం సేకరించే పనిలో ఉన్నట్లు నిడమర్రు పోలీసులు తెలియజేశారు.
ఇవీ చదవండి:'దివ్య'మైన జీవితాన్ని.. దారి తప్పించి.. దారుణంగా చంపేశారు!