పబ్జీ గేమ్ మరో విద్యార్థి ప్రాణాలను బలి తీసుకుంది. తండ్రి.. ఫోన్‌లో పబ్జీ అడనివ్వలేదనే కోపంతో కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలంగాణ : పబ్జీ అడనివ్వలేదనే కోపంతో కుమారుడు ఆత్మహత్య - student sucide at Yelkicherla News
పబ్జీ గేమ్ ప్రాణాలను హరిస్తోంది. పబ్జీకి బానిసలైన వారిని ఆ గేమ్ ఆడొద్దని వారించినందుకు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల తరచుగా చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ వికారాబాద్ జిల్లాలో ఇలాంటి దారుణమే జరిగింది. పబ్జీ ఆటపై మోజు ఓ బాలుడి ప్రాణం బలి తీసుకుంది.
పబ్జీ
తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండ వెల్కిచర్ల గ్రామంలో జరిగిన ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :తెలంగాణ: సవతి పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ