కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం స్వామినగర్కు చెందిన బి.నెట్టికంటి, లక్ష్మీదేవి దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో ఇద్దరు ఆడపిల్లలు కాగా హరికృష్ణ 19 ఏళ్ల యువకుడు. దంపతులిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. హరికృష్ణ కూడా కూలీ పనులకు వెళ్లేవాడు.
డబ్బులు కావాలి..
ఈ నేపథ్యంలో హరికృష్ణ తనకు నచ్చిన ద్విచక్రవాహనాన్ని ఎంపిక చేసుకుని తల్లిదండ్రుల వద్దకు వచ్చి బైక్ కొనుక్కుంటాను డబ్బులు ఇవ్వాలని అడిగాడు. తమ వద్ద డబ్బులు లేవని బదులిచ్చిన తల్లిదండ్రులు.. కూలీ డబ్బులు పోగేసుకుని వాహనం కొనుగోలు చేసుకోమని కుమారుడికి సూచించారు.