రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ, విజయనగరం పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ శివారు ప్రాంతమైన మధురవాడ వాంబే కాలనీకి చెందిన ఆరుగురు యువకులు ఓ ముఠాగా ఏర్పడి ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.
జిల్లాలో 19 కేసులు..
వీరు ఉదయం పూట రెక్కీ నిర్వహించి.. రాత్రి వేళల్లో ఆటోలో బయలుదేరి ఆలయాల్లోని హుండీలు, ఇతర వస్తువులు దొంగతనాలు చేస్తుంటారు. ఇలా విశాఖ, విజయనగరం జిల్లాలో 19 కేసులు నమోదైనట్లు విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి.రంగారావు వెల్లడించారు.