హైదరాబాద్ సీసీఎస్ ఎస్‌ఐ సైదులు ఆత్మహత్య చేసుకోవడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అంబర్‌పేట పరిధి పటేల్‌నగర్‌లోని తన నివాసంలో సైదులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్‌లో సీసీఎస్ ఎస్ఐ ఆత్మహత్య - ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ
హైదరాబాద్ అంబర్‌పేట పరిధిలోని పటేల్‌నగర్‌లో నివాసం ఉంటున్న సీసీఎస్ ఎస్‌ఐ సైదులు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరివేసుకోవడానికి గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు.
![హైదరాబాద్‌లో సీసీఎస్ ఎస్ఐ ఆత్మహత్య si-suicide-in-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5465580-918-5465580-1577090055206.jpg)
si-suicide-in-hyderabad
హైదరాబాద్‌లో సీసీఎస్ ఎస్ఐ ఆత్మహత్య
ఎస్ఐ సతీమణి పిల్లలను స్కూల్ వద్దకు తీసుకెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2017 బ్యాచ్‌కు చెందిన ఎస్ఐ సైదులు ఆత్మహత్యకు గల కారణం అధికారుల వేధింపులా, కుటుంబ కలహాలా, వేరే ఇతర సమస్యలా అనేది తెలియాల్సి ఉంది.
5 నెలల సెలవులు అనంతరం గత నెల్లోనే ఎస్‌ఐ సైదులు విధుల్లో చేరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.