శంషాబాద్ విమానాశ్రయంలో సోదాల్లో మరోసారి పెద్ద ఎత్తున బంగారం బయటపడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి లగేజీని ముందస్తు సమాచారంతో అధికారులు తనిఖీ చేశారు. అందులో 11.1 కిలోల పుత్తడిని గుర్తించారు. దీని విలువ సుమారు 3 కోట్ల 63 లక్షల 52 వేల 500 రూపాయలుగా అంచనా వేశారు. వీటితో పాటు 4 లక్షల 25 వేల విలువైన సింగపూర్ డాలర్లు, యూఏఈ దీరమ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మహిళ గత మూడు నెలలుగా నివాసం ఉంటున్న ఓ ఐదు నక్షత్రాల హోటల్ గదిలో అధికారులు సోదాలు చేశారు. ఒక కోటి 50 లక్షల 64 వేల 12 రూపాయల విలువైన అమెరికా డాలర్లు, సౌదీ రియాల్స్ స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో 11 కిలోల బంగారం సీజ్
శంషాబాద్ విమానాశ్రయంలో 11 కిలోల బంగారం, కోటిన్నర విలువైన విదేశీ నగదు లభించింది. పక్కా సమాచారంతో విదేశాల నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద తనిఖీ చేయగా.. ఈ మొత్తం లభించింది.
gold
దుబాయ్లో బంగారం ఎవరిచ్చారు.. హైదరాబాద్లో ఎవరికి ఇవ్వమన్నారు.. గతంలో బంగారం ఎంత మేర అక్రమ రవాణా చేసిందనే కోణంలో ఆరా తీస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు.
ఇవీ చూడండి: సైబర్ నేరాల దర్యాప్తులో నిర్లక్ష్యం... బాధితులకేదీ న్యాయం