గుంటూరు యువతిపై లైంగికదాడి కేసును పోలీసులు ఛేదించారు. కేసులో మరో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఈ కేసులో మరో ఐదుగురు కూడా ఉన్నారని తెలుస్తోందని ఆయన అన్నారు. నిందితుల నుంచి చరవాణులు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు . కళాశాల యువత కెరీర్‌పై దృష్టి పెట్టాలని ఎస్పీ సూచించారు.
ఒకరి నుంచి మరొకరికి...
ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సూత్రధారి తెనాలికి చెందిన మణికంఠగా గుర్తించామని.., దీనికోసం అతను పాత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వినియోగించాడని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. మణికంఠ తన ఖాతా నుంచి నగ్నచిత్రాలు అప్‌లోడ్ చేశాడని.., వేరే సమయంలో ఇదే అకౌంట్ నుంచి ధనుంజయరెడ్డి అప్‌లోడ్ చేశాడని ఎస్పీ పేర్కొన్నారు. కౌశిక్ షేర్ చేసిన వీడియోలు భాస్కర్‌కు చేరాయని.. తర్వాత మిగతా వారికీ ఒక్కొక్కరిగా ఈ చిత్రాలు చేరాయని తెలిపారు. కేసులో వరుణ్, కౌశిక్, మణికంఠ, ధనుంజయరెడ్డి కీలక నిందితులని ఎస్పీ పేర్కొన్నారు.