ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

గాలిపటం ఎగరేస్తుండగా బాలుడికి విద్యుదాఘాతం.. తీవ్ర గాయాలు - Hyderabad Crime News

హైదరాబాద్ లోని జవహర్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధి అరుంధతి నగర్​లో ఓ బాలుడు గాలిపటం ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్​ షాక్ తగిలింది. దీనితో ఆ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి.

పతంగి ఎగురవేస్తుండగా.. చిన్నారికి కరెంటు షాక్‌
పతంగి ఎగురవేస్తుండగా.. చిన్నారికి కరెంటు షాక్‌

By

Published : Oct 8, 2020, 6:33 PM IST

హైదారాబాద్ జవహర్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని అరుంధతినగర్​లో 7 సంవత్సరాల బాలుడు నిఖిల్​ గాలిపటం ఎగురవేస్తుండటంగా ప్రమాదవశాత్తు విద్యుత్​ తీగ తగిలి తీవ్రగాయాల పాలయ్యాడు. పతంగి కరెంటు తీగలను చుట్టుకున్న ఆ క్రమంలో దానిని తీసే క్రమంలో షాక్​ తగిలింది.

ఈ ప్రమాదంలో బాలుడి తల, మొహం, ఛాతి కాలిపోయింది. గమనించిన తల్లి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. తండ్రి రాజు 2 సంవత్సరాల క్రితం చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details