ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

మన్యం నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత - గంజాయి పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. సుమారు 36 బ్యాగుల్లో రూ.1.48 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

మన్యం నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
మన్యం నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

By

Published : Nov 4, 2020, 5:48 PM IST

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న 36 బ్యాగుల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు. ముందస్తు సమాచారంతో సీఐ రవికుమార్ ఆధ్వర్యంలోమారేడుమిల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా రూ.1.48 లక్షల విలువైన గంజాయిని ఎస్ఐ రామకృష్ణ పట్టుకున్నారని బిందు పేర్కొన్నారు.

అటు తరలిస్తున్నారని గమనించాం..

విశాఖ జిల్లా మన్యం నుంచి వరంగల్ జిల్లాకు తరలిస్తున్నట్లు గుర్తించామని బుధవారం మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో బిందు మాధవ వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులతో పాటు బొలెరో వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : నాడు-నేడు పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదు: మంత్రి సురేశ్

ABOUT THE AUTHOR

...view details