ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

తెలంగాణ నుంచి రాష్ట్రానికి తరలిస్తున్న మద్యం పట్టివేత - suryapet district crime news

తెలంగాణలోని నల్గొండ నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలించేందుకు కొందరు చేసిన ప్రయత్నాన్ని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. సూర్యాపేట జిల్లాలో వారిని పట్టుకుని.. మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ నుంచి రాష్ట్రానికి తరలిస్తున్న మద్యం పట్టివేత..
తెలంగాణ నుంచి రాష్ట్రానికి తరలిస్తున్న మద్యం పట్టివేత..

By

Published : Oct 5, 2020, 7:39 PM IST

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం దొండపాడులో అర్ధరాత్రి కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని గ్రామస్థులు పట్టుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సుమారు 1,000 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు.

మద్యాన్ని నల్గొండ నుంచి ఆంధ్రప్రదేశ్​కు తరలిస్తున్నట్లు గుర్తించారు. మరోవైపు చింతలపాలెం మండల కేంద్రంలో ఉన్న వైన్ షాపులో మద్యం కోసం వెళ్తే ఒకటి లేదా రెండు బాటిళ్లు మాత్రమే ఇస్తున్నారని.. మిగిలింది ఎక్కువ రేటుకు ఆంధ్రాకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details