ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

పోలీసు కస్టడీకి అఖిలప్రియ వ్యక్తిగత సహాయకులు - తెలంగాణ నేర వార్తలు

బోయిన్‌పల్లి అపహరణ కేసులో ఇద్దరు నిందితులను సికింద్రాబాద్‌ కోర్టు కస్టడీకి అనుమతించింది. అఖిలప్రియ వ్యక్తిగత సహాయకులు మల్లికార్జున్‌రెడ్డి, సంపత్‌ను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం అనుమతిచ్చింది.

boinpally kidnap case
బోయిన్‌పల్లి అపహరణ కేసు

By

Published : Jan 20, 2021, 3:11 AM IST

తెలంగాణలో సంచలనం సృష్టించిన బోయిన్​పల్లి కిడ్నాప్​ ఘటనలో విచారణ వేగంగా జరుగుతోంది. కేసుకు సంబంధించి అఖిలప్రియ వ్యక్తిగత సహాయకులిద్దర్ని పోలీసు కస్టడీకి సికింద్రాబాద్‌ కోర్టు అనుమతినిచ్చింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఇద్దరినీ బుధవారం ఉదయం పది గంటల సమయంలో బోయిన్‌పల్లి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఆసుపత్రిలో వైద్య చికిత్సల అనంతరం నిందితులను అపహరణ వ్యవహారంలో మరింత లోతుగా విచారించనున్నారు.

అఖిలప్రియ కూడా సెషన్స్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు బుధవారం వాదనలు విననుంది.

ABOUT THE AUTHOR

...view details