టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. రవిప్రకాశ్, నటుడు శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని పోలీసులు అంచనాకు వచ్చారు. రవిప్రకాశ్, శక్తి అనే వ్యక్తి నుంచి, డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తి, రవిప్రకాశ్ సన్నిహితుడు హరి, ఎబీసీఎల్ మాజీ ఫైనాన్స్ అధికారి మూర్తి మధ్య బదిలీ అయిన పలు ఈ-మెయిళ్లను సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ-మెయిల్స్ ఆధారాలు దొరకకుండా సర్వర్‌ల నుంచి రవిప్రకాశ్, ఆయన అనుచరులు వాటిని తొలగించినప్పటికీ, సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి వీటిని వెలికి తీశారు.
నకిలీ పత్రాల గుర్తింపు
రవిప్రకాశ్ నుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు శివాజీ ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నట్లు సృష్టించిన ఒప్పందపు డ్రాఫ్ట్‌ను వాస్తవానికి ఏప్రిల్ 13, 2019న తయారు చేసినట్లు గుర్తించారు. ఈ డ్రాఫ్ట్‌ను ఆ రోజు సాయంత్రం 5:46 గంటలకు ఫైనాన్స్ అధికారి మూర్తికి మెయిల్ చేసిన శక్తి... రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తి, హరిలకూ కాపీలు పంపినట్లు సమాచారం. వీరందరి మధ్య మెయిళ్లు బదిలీ అయినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. వీటి ఆధారంగానే సెక్షన్ 41 సీఆర్పీసీ కింద పోలీసులు రవిప్రకాశ్‌కు నోటీసులు పంపారు.
సర్వత్రా ఆసక్తి