కర్నూలు జిల్లా నంద్యాలలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో దోపిడీ దొంగతనాలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో బాధితులు సదరు దోపిడీ దొంగల ముఠాపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మొత్తం ఏడుగురు..
విచారణలో భాగంగా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారి నుంచి 4 చరవాణిలు, 2 ద్విచక్ర వాహనాలు సహా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల వైఎస్నగర్కు చెందిన మరాటే సిందే చంద్ర కుమార్ ఈ కేసులో ప్రధాన నిందితుడని నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు. సిందే గతంలో 15 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని వెల్లడించారు.
ఇవీ చూడండి:
యువతిని మోసం చేసిన ఏఆర్ కానిస్టేబుల్ అరెస్ట్