తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కడప జిల్లా మైదుకూరు నుంచి కాకినాడ టమాటా లోడుతో వ్యాన్ వెళ్తోంది. తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా గోపాలపురానికి చేరుకుంది. జాతీయరహదారిపై వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి.. బోల్తా పడింది. ఈ ఘటనలో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న గోపాలపురంవాసి కండేల్లి సతీష్ (21).. అక్కడికక్కడే మృతి చెందాడు.
బైకును ఢీ కొట్టిన వ్యాన్.. ముగ్గురు మృతి - గోపాలపురంలో రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి న్యూస్
accident at gopalapuram
07:06 January 02
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన వ్యాన్
మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా గోపాలపురానికి చెందిన కొండేటి చంటి (20) మృతి చెందాడు. కొత్తపేట మండలం కండ్రిగ గ్రామానికి చెందిన వంగలపూడి సురేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:
Last Updated : Jan 2, 2021, 9:05 AM IST