ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఎర్రచందనం అక్రమ రవాణా ముఠా అరెస్టు... భారీగా దుంగలు స్వాధీనం - 27 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

సినీఫక్కీలో ఎర్ర చందనం దుంగలు తరలించాలనుకున్నారు. ఎస్కార్ట్ వాహనాలనే అక్రమ రవాణాకు సాధనంగా చేసుకున్నారు. కడప జిల్లా నుంచి భారీ స్థాయిలో ఎర్ర చందనం దుంగలను బెంగళూరుకు తరలిస్తుండగా అనంతపురం పోలీసులకు పట్టుబడ్డారు.

27 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసిన పోలీసులు

By

Published : Nov 3, 2019, 10:17 AM IST

ఎర్రచందనం అక్రమ రవాణా ముఠా అరెస్టు

సినీఫక్కీలో ఎర్ర చందనం దుంగలను రాష్ట్రం దాటిస్తోన్న ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు నరికి, వాటిని గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన 27 మంది ముఠాగా ఏర్పడి స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిపారు. వీరు ఎవరికీ అనుమానం రాకుండా దుంగల తరలించేందుకు ఎస్కార్ట్ వాహనాలు ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.

భారీగా ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

అనంతపురం నగర శివారులోని పంగల్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. విచారించగా మొత్తం ఈ తతంగమంతా బయటపడింది. వీరి వద్ద నుంచి 1647 కిలోలు ఎర్రచందనం, 610 కిలోల సండ్ర దుంగలు, రెండు బొలెరో వాహనాలు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 27 మందిని అరెస్టు చేయగా మరో ఐదు మంది పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వీర రాఘవ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:

కుంగదీస్తున్నాయి క్యాన్సర్‌ కణాలు... ఆదుకోవాలని ఓ కుటుంబం వేడుకోలు...

ABOUT THE AUTHOR

...view details