తెలంగాణలోని వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం మోమిన్ కలాన్లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను రాములు(40) అనే వ్యక్తి అన్నం పెట్టమని పిలిచి దారుణానికి ఒడిగట్టాడు.
తెలంగాణ: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం - వికారాబాద్ జిల్లా నేర వార్తలు
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం మోమిన్ కలాన్లో దారుణం జరిగింది. అన్నం పెట్టమని పిలిచి.. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడో ప్రబుద్ధుడు.

rape-attempt
అతని నుంచి తప్పించుకున్న బాలిక ఇంట్లో వారికి చెప్పడంతో 100 కు డయల్ చేశారు. పోలీసులు బాలికను సఖి కేంద్రానికి తరలించి వివరాలు సేకరించారు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ధరూర్ సీఐ మురళీకృష్ణ తెలిపారు.