రాజంపేట డీఎస్పీ మురళీధర్ అందించిన సమాచారం ప్రకారం ఓబులవారిపల్లె మండలం బొంతవారిపల్లిలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఎస్సై మోహన్ ఆధ్వర్యంలోని బృందం పట్టుకున్నారు. నిందితుల నుంచి 3 చరవాణులు, క్రికెట్ బెట్టింగ్ స్లిప్పులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన వ్యక్తుల్లో ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు దిగువ పల్లెకు చెందిన షేక్ మౌలానా, వెంకటరమణ, కటికంవారిపల్లికి చెందిన నాగేంద్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
క్రికెట్ కేటుగాళ్లు అరెస్టు....రూ.14 లక్షలు స్వాధీనం - rajampeta
కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లెలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి పోలీసులు రూ.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
క్రికెట్ కేటుగాళ్లు అరెస్టు....రూ.14 లక్షలు స్వాధీనం