ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

గొడవ ఆపేందుకు ప్రయత్నించబోతే... లారీ కిందకు తోసేశారు!

బంధువుల గొడవను ఆపేందుకు వెళ్లిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎదురెదురుగా ఉంటున్న రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి. తమనే వంకపెట్టి తిడుతున్నారని ఇరువురూ వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ కాస్త పెద్దదే కర్రలతో దాడి చేసుకునే వరకు వచ్చింది. బంధువు గొడవ పడుతున్నాడని ఆపేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై అవతలి వర్గం కర్రలతో దాడిచేసింది. అటుగా వస్తున్న లారీ కింద తోసేసింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.

గొడవ ఆపేందుకు ప్రయత్నిస్తే...లారీ కింద తోసేశారు!
గొడవ ఆపేందుకు ప్రయత్నిస్తే...లారీ కింద తోసేశారు!

By

Published : Oct 7, 2020, 5:16 PM IST

Updated : Oct 7, 2020, 6:00 PM IST

గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని గుళ్లపల్లి గ్రామంలో ఓ వ్యక్తిని మంగళవారం రాత్రి దారుణంగా హత్య చేశారు. నరసరావుపేట గ్రామీణ సీఐ వై.అచ్చయ్య తెలిపిన వివరాల ప్రకారం గుళ్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల ఏడుకొండలుకు.. ఎదురింట్లో ముజాఫర్ సైదా మధ్య విభేదాలు ఉన్నాయి. ఏడుకొండలు తననే తిడుతున్నాడని ముజాఫర్ సైదా భావించి తన బంధువులతో కలిసి దాడికి దిగారు. ఈ క్రమంలో ఏడుకొండలు బంధువైన తిరుపతి అంకమరావు గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. అంకమరావుపై సైదా, అతని బంధువులు కర్రలతో దాడి చేశారు.

గొడవ సమయంలో రహదారిపై వెళ్తున్న లారీ కిందకు అంకమరావును తోసి హత్య చేశారని మృతుని బంధువులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని సీఐ తెలిపారు.

అంకమరావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాల వద్దకు చేరుకున్న మృతుని బంధువులు... ఎలాంటి తప్పు చేయని తమ ఇంటి వ్యక్తిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంకమరావుపైనే అతని కుటుంబం ఆధారపడిఉందన్నారు. అతనికి ఒక కొడుకు, కూతురు ఉన్నారని చెప్పారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని బంధువులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

నా బంగారు తండ్రీ... తిరిగి రా అయ్యా

Last Updated : Oct 7, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details