ప్రకాశం జిల్లా కంభంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని రెండు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గిద్దలూరు నుంచి వెళ్లిన అగ్నిమాపకయంత్రం మంటలను పూర్తిగా ఆర్పి వేసింది. పూరిళ్లు దగ్ధమవుతున్న సమయంలో ఇంటి యజమానులు ఎవరూ లేరు. అందరూ ఉపాధి హామీ పథకం పనుల కోసం వెళ్లారు. ఈ దుర్ఘటనతో దాదాపు రెండు లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్టు స్థానికులు చెబుతున్నారు.
కంభంలో అగ్నిప్రమాదం.. రెండు పూరిళ్లు దగ్ధం
ప్రమాదవశాత్తు నిప్పుంటుకొని ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. దాదాపు రెండు లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రకాశం జిల్లాలో రెండు పూరిల్లు దగ్ధం