ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

వైద్యం వికటించి మహిళ మృతి.. ఆసుపత్రి ముందు బంధువుల ధర్నా - Narayanapeta District Latest News'

ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్ర చికిత్స వికటించి మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని... తమకు న్యాయం చేయాలంటూ.. కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

protest
protest

By

Published : Nov 14, 2020, 2:23 PM IST

తెలంగాణ.. నారాయణ పేట జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్ర చికిత్స వికటించి.. మహిళ మృతి చెందింది. కర్ణాటక రాష్ట్రం తప్పెట్ల గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ ఈనెల 12న కడుపు నొప్పి భరించలేక చికిత్స నిమిత్తం ప్రైవేట్​ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి వైద్యులు పరీక్షలు చేసి శస్త్ర చికిత్స నిర్వహించారు.

అదే రోజు రాత్రి చికిత్స అనంతరం తీవ్ర రక్తస్త్రావం అయింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తమ ప్రమేయం లేకుండానే ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ పేట జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందని.. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ముందు మహిళ మృతదేహాన్ని ఉంచి తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details