ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

టచ్ ఫోన్​కు ఆశపడ్డాడు.. కటకటాల పాలయ్యాడు - arthaveedu ci raghavendhra rao

ప్రకాశం జిల్లా అర్దవీడు మండలం పోతురాజుటూరు గ్రామ అడవిలో గత నెల 24న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి వివాదమే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు.

టచ్ ఫోన్​కు ఆశపడ్డాడు.. కటకటాల పాలయ్యాడు
టచ్ ఫోన్​కు ఆశపడ్డాడు.. కటకటాల పాలయ్యాడు

By

Published : Nov 10, 2020, 3:44 PM IST

గత నెల 24న ప్రకాశం జిల్లా అర్దవీడు మండలం పోతురాజుటూరు గ్రామ అడవిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి వివాదమే హత్యకు కారణమని సీఐ రాఘవేంద్రరావు తెలిపారు.

హత్యకు కుట్ర..

పశువుల కాపరి చిన్న కాశయ్య తరచూ తమను దుర్భాషలాడుతున్నాడని.. అందుకే పెద్ద వెంకటేశ్వర్లు కాశయ్యను చంపేందుకు పథకం రచించాడని సీఐ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తన సమీప బంధువు రామలింగయ్య సహకారం కోరాడు.

సహకరిస్తే టచ్​ ఫోన్ కొనిస్తా..

హత్యకు సహకరిస్తే టచ్ ఫోన్ కొనిస్తానని ప్రధాన నిందితుడు హామీ ఇచ్చాడు. పథకం ప్రకారమే చేసిన హత్యలో రామలింగయ్య సైతం కీలక పాత్ర వహించాడని సీఐ స్పష్టం చేశారు.

నమ్మించి..

ఫలితంగా చిన్న కాశయ్యను నమ్మించి సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలిపారు. మృతుడు కాశయ్య.. నిందితులది ఒకే గ్రామం కావడంతో పోలీసులు మూడు రోజుల్లోనే కేసును ఛేదించారు.

ఇవీ చూడండి : 20 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 240 ఓట్ల ఆధిక్యం

ABOUT THE AUTHOR

...view details