ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

తెలంగాణ: ఓఆర్‌ఆర్‌పై బస్సు దగ్ధం.. తప్పిన ప్రాణనష్టం - అగ్నిప్రమాదం వార్తలు

తెలంగాణ రంగారెడ్డి జిల్లా పరిధిలోని చిన్న గోల్కొండ వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి. ఓఆర్ఆర్‌పై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

BUS FIRE
ఓఆర్‌ఆర్‌పై బస్సు దగ్ధం

By

Published : Dec 13, 2020, 3:58 AM IST

శంషాబాద్ బాహ్యవలయ రహదారిపై అగ్నిప్రమాదం సంభవించింది. చిన్న గోల్కొండ వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి. ఓఆర్ఆర్‌పై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా బస్సులో మంటలు వ్యాపించాయి. మంటలను గమనించి డ్రైవర్ వెంటనే కిందకు దూకేశాడు.

ఓఆర్‌ఆర్‌పై బస్సు దగ్ధం

ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. బస్సు పూర్తిగా దగ్ధమైంది. కేసు నమోదు చేసిన శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details