ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

చిత్తూరు జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా..ముగ్గురు మృతి - three members killed in raod accident in ap news

accident
accident

By

Published : Nov 3, 2020, 4:08 PM IST

Updated : Nov 3, 2020, 6:01 PM IST

16:05 November 03

చిత్తూరు జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా

చిత్తూరు జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా..ముగ్గురు మృతి

             చిత్తూరు జిల్లా మదనపల్లె-పుంగనూరు రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె నుంచి బండకిందపల్లికి వెళ్తున్న ఓ ప్రైవేట్ మినీ బస్సు బోల్తాపడి ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా మరో 20మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఎర్రబల్లి, బండకిందపల్లికి చెందినవారుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 

అతివేగంగా వస్తూ అదుపు చేయలేక రోడ్డు పక్కన ఉన్న బండరాయిని బస్సు ఢీకొట్టడమే  ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కేవలం 15 సీట్లున్న ప్రైవేట్ మినీ బస్సులో....30మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ప్రమాదస్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు వెంటనే అంబులెన్సు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదానికి ప్రైవేట్ బస్సు నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి

రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య.. నలుగురు మృతి

Last Updated : Nov 3, 2020, 6:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details