రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన తల్లి కుమారుడు అపహరణ ఘటన ఎట్టకేలకు తెరపడింది. వారు క్షేమంగా దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
బండ్లగూడలోని బైరాగిగూడకు చెందిన తల్లీకుమారులు ఆదిలక్ష్మి, మృదుల్, ప్రజ్వల్ కలిసి స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత పెద్ద కుమారుడు మృదుల్ పని ఉందంటూ తిరిగి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ప్రజ్వల్ తన సోదరుడికి ఫోన్‌చేసి గుర్తుతెలియని వ్యక్తులు తనను, తల్లిని అపహరించారని తెలిపాడు.